Business

TollyWood

Breaking News

Technology

BollyWood

ప్రముఖ దర్శకుడి పై సెక్స్ ఆరోపణలు చేసిన హీరోయిన్ !



“హేట్ స్టోరీ-2” సినిమాలో హాట్ సీన్స్ లో నటించి ఒక రేంజ్ లో పేరు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా దక్షణాది సినిమా రంగానికి చెందిన ఒక ప్రముఖ దర్శకుడి పై సెక్స్ ఆరోపణలు చేయడం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఏ విషయంలో అయినా చాల ఫాస్ట్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీలు తమకు బాలీవుడ్ లోని పరిస్థుతులకన్నా దక్షిణాది సినిమా రంగంలోని పరిస్థుతులే బాగుంటాయి అని చెపుతూ ఉంటారు.  అయితే దీనికి విరుద్ధంగా ఒక బాలీవుడ్  హీరోయిన్ ఒక దక్షిణాది సినిమారంగ దర్శకుడి పై ఇటువంటి ఆరోపణలు చేయడం ఇదే ప్రప్రధమం. 
                                  ఇక వివరాలలోకి వెళితే సుర్వీన్ ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలు తెలియచేసింది.  తాను దక్షిణాదిలో సినిమాలు చేసిన సమయంలో చాల ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. అప్పట్లో తనకు సినిమా ఆఫర్ చేయడానికి ముందుకొచ్చిన ఓ క్యాస్టింగ్ ఏజెంట్ ఆ సినిమా కథ బాగా అర్థం కావడానికి ఆ సినిమా డైరెక్టర్ తనతో సెక్స్‌కి అంగీకరించాల్సిందిగా అడుగుతున్నాడని చెప్పినప్పుడు తాను ఆ విషయాన్ని నమ్మలేకపోయానని అంటూ దక్షిణాది సినిమా రంగంలో కూడా ఇటువంటి పరిస్థుతులు ఉన్నాయా? అని ఆశ్చర్య పోయానని ఆనాటి విషయాలను చెప్పుకొచ్చింది సుర్వీన్.  
                                   అంతేకాదు తనకు ఈ సందేశం పంపిన దర్శకుడు దక్షిణాది సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ అంటూ మరో బాంబ్ పేల్చింది. అయితే తమిళంలో కొన్ని సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేసిన సుర్వీన్ కేవలం తన పాపులారిటీ మీడియాలో పెంచుకోవడం కోసం ప్రత్యేకించి పలానా అని ఏ డైరెక్టర్ పేరు చెప్పకుండా ఇటువంటి ఆరోపణలు చేసింది అని విమర్శకులు అంటున్నారు. అయినా ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడం వల్లసుర్వీన్ కు వచ్చిన ప్రయోజనం ఏమిటో మరి!

No comments:

Post a Comment

Designed By Blogger Templates