మళ్లీ
తిరిగి కెమెరా ముందుకొచ్చి మెగాస్టార్ అంటే ఏంటో చూపిద్దామని చిరంజీవి
తహతహలాడుతోంటే ఆయనకి తగ్గ కథ దొరక్క 150వ సినిమా ముందుకి కదలడం లేదు. గతంలో
చిరంజీవి కనిపిస్తే అభిమానులు 150వ సినిమా ఎప్పుడని పీడించిన అభిమానులు
కూడా ఇప్పుడు ఆ ఊసెత్తడం మానేసారు. అరవయ్యేళ్ల చిరంజీవి వచ్చి ఇప్పుడిక
చేసేదేముందని అనుకుంటున్నారో ఏమో మరి. ఎవరూ తనని తన సినిమా గురించి
అడక్కపోతే.. తనే కల్పించుకుని దాని గురించి మాట్లాడుతున్న చిరంజీవికి ఇంకా
దర్శకుడైతే సెట్ కాలేదు.
కృష్ణవంశీతో చేస్తాడని అనుకున్నారు కానీ అది జరిగేలా లేదు. ప్రస్తుతం
చిరంజీవి కన్ను గుణశేఖర్‌పై పడిందట. గతంలో తనకి చూడాలని ఉంది సినిమాతో
బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గుణశేఖర్ అయితే తనని బాగా హ్యాండిల్ చేస్తాడని
చిరంజీవి నమ్మకం. అయితే అదే గుణశేఖర్ చిరంజీవితో మృగరాజు కూడా తీసాడు. ఒక
ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన లైట్ తీసుకోవాల్సిన దర్శకుడు కాదు కనుక
గుణశేఖర్ ఆప్షన్‌ని కన్సిడర్ చేయడం మంచి స్టెప్పే అనుకోవాలి
No comments:
Post a Comment