సూడాన్: సైనికులు ఓ గ్రామాన్ని చుట్టుముట్టి, గ్రామంలోని మగవారిని గ్రామం వెలుపలకు తరిమేసి, నిస్సహాయ స్థితిలో ఉన్న 200 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాలకు వెళ్లే బాలికల పైన కూడా వీరు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. వారిని కూడా వదిలి పెట్టలేదు. దాదాపు, ఎనిమిది గంటలపాటు మానభంగపర్వం కొనసాగించారు. సూడాన్‌లోని నార్త్‌డార్ఫుర్ ప్రాంతంలోని టాబిట్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్ ఫాషర్ నగరానికి దగ్గర్లో ఉన్న టాబిట్ గ్రామంలోకి ఉదయం ఓ సైనికాధికారి వచ్చాడు. తమ సైనికుడు ఒకడు కనిపించడం లేదని అతడిని తమకు అప్పగించాలని గ్రామస్థులకు హుకుం జారీ చేశాడు.
అదే రోజు రాత్రి సైనికులు ఆ గ్రామం పైన దాడి చేశారు. గ్రామంలో ఉన్న మగవారినందరినీ తుపాకీ మడమలతో కొడుతూ గ్రామం వెలుపలికి తరిమేశారు. 80 మంది స్కూలు విద్యార్థినులతో సహా 200మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. శుక్రవారం సాయంత్రం మొదలైన వీరి మానభంగ పర్వం శనివారం ఉదయం నాలుగు గంటలవరకు కొనసాగింది. కాగా తమ సైనికుల తప్పిదానికి క్షమించాల్సిందిగా కమాండర్ గ్రామస్థులను కోరాడు. కానీ అతడి క్షమాపణలను గ్రామస్థులు తిరస్కరించారు.
No comments:
Post a Comment