హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ నటించడంతో ఈచిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. త్వరలో చిత్రానికి సీక్వెల్‘రోబో-2' కూడా రాబోతోంది. అయితే సీక్వెల్ లో రజనీకాంత్ కాకుండా మరొకరు నటిస్తారని తెలుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది.
అందుకు దర్శకుడు శంకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధం చేశాడు. భారీ యాక్షన్ సినిమాను మళ్లీ చేయడానికి తన ఆరోగ్యం సహకరించదని రజనీకాంత్ చెప్పడంతో , మరో హీరో కోసం రిలయన్స్ సంస్థ అన్వేషణ చేస్తోంది. అయితే ‘రోబో-2' ఎవరితో ఉంటుందనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రానప్పటికీ.....తమిళ హీరో విజయ్ వైపు రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా శంకర్ నిర్ణయంపైనే రోబో-2 చిత్రం ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం శంకర్ ‘ఐ' సినిమా విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు విజయ్ ‘కత్తి' సినిమాతో హిట్టు కొట్టి త్వరలో శింబుదేవన్ దర్శకత్వంలో భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ పనులు పూర్తయ్యాక.....2015 ద్వితీయార్థంలో ‘రోబో-2' చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
No comments:
Post a Comment