Business

TollyWood

Breaking News

Technology

BollyWood

మీడియాకు హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ నందనా సేన్ నగ్నప్రదర్శన !



బాలీవుడ్ హీరోయిన్ నందనా సేన్ నటించిన ‘రంగ్ రసియా' చిత్రం మీడియాకు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా ఈ నెల 7వ తేదీన విడుదలవుతోంది. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ పేరు తెలియని వారుండరు. ఈరోజు భారతీయులంతా అత్యంత భక్తితో పూజించే దేవుళ్ళ రూపాలను తన ఊహా శక్తితో చిత్రీకరించిన ఘనత రవి వర్మది. ఆయన జీవితం ఆధారంగా విడుదల కాబోతున్న ‘రoగ్ రసియా’ సినిమాలో రాజా రవివర్మ పాత్రలో రణదీప్ హుడా నటిస్తూ ఉండగా రాజా రవివర్మ ఊహాల్లో విహరించే ప్రేయసిగా బాలీవుడ్ హీరోయిన్ నందనా సేన్ నటించింది. 
                                       ఈ సినిమా కథను బట్టీ ఆమె పలు సన్నివేశాలలో నగ్నంగా నటించింది. ఈ సినిమా గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ వెండి తెర పై తెరపై నగ్నంగా నటించడం అనేది చాలా కష్టమైన అంశం అని అంటూ ఈ విషయాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి చాల పర్ ఫెక్టుగా నటించానని అంటూ ఈ సినిమాలో నగ్నంగా నటించడానికి ఓకే చెప్పే ముందు తన తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాను అని అంటోంది ఈ బ్యూటీ. 
                                           మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నందనా సేన్ తండ్రి ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్తగా పేరుగాంచి నోబెల్ ఫ్రైజ్ పాటు భారత రత్న అవార్డు అందుకున్న ఆమర్థ్య సేన్. నందన తల్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ రచయిత్రి నబనీత దేవ్ సేన్. ఇలాంటి ప్రముఖుల కుటుంబంలో పుట్టిన నందనా సేన్ ఒక వివాదాస్పద సినిమాలో నటించడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

No comments:

Post a Comment

Designed By Blogger Templates