గత జనవరిలో ఏ సమయంలో మొదలుపెట్టారో తెలియదు కాని ‘గబ్బర్ సింగ్-2’ ప్రారంభం కాకుండానే ఈ సినిమా పై వచ్చినన్ని రూమర్లు మరే సినిమా పైనా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపధ్యంలో మరో సంచలనాత్మకమైన న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తూ అందరి మైండ్ బ్లాంక్ చేస్తోంది. దర్శకుడు సంపత్ నంది పవన్ తో తీద్దాము అనుకున్న ‘గబ్బర్ సింగ్-2’ కథను కొద్దిగా మార్పులు చేసి రవితేజాతో తీయబోయే సినిమాకు స్క్రిప్ట్ గా మారుస్తున్నాడు అంటూ ఈ సినిమా పై మరో వార్త నమ్మలేని న్యూస్ గా మారింది. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ కు స్టొరీ లైన్ మొదట ఇచ్చింది పవన్ కళ్యాణ్ అయినా ఆ కథను స్క్రిప్ట్ గా మొదట మార్చింది సంపత్ నంది.
అయితే ఆ స్క్రిప్ట్ పూర్తిగా పవన్ కు నచ్చకపోవడంతో పవన్ స్వయంగా చాల మార్పులు చేసుకున్నాడు అనే టాక్ ఉంది. దీనితో సంపత్ నంది మొట్టమొదటిగా పవన్ కు ఇచ్చిన స్క్రిప్ట్ రవితేజ సినిమాకు కథగా మారుతోంది అని గాసిప్ రాయళ్ళ కథనం. టాలీవుడ్ ఎంపరర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న పవన్ దగ్గర ఉన్న కథను పవన్ అంగీకారం లేకుండా సంపత్ నంది రవితేజా సినిమా కథగా మార్చే సాహసం చేయలేడు అని చాలామంది అంటున్నారు. అయితే ఈగాలి వార్తలకు ఎక్కడో ఒక ఆధారం ఉంది అని భావించే విశ్లేషకులు కూడా ఉన్నారు. ఈ వార్తల పై మరి కొద్దిరోజులలో క్లారిటీ వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు...
No comments:
Post a Comment