Business

TollyWood

Breaking News

Technology

BollyWood

ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్ ఇచ్చిన శ్రీదేవి



అతిలోక సుందరిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ శ్రీదేవి. ఇదిలా ఉంటే శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ సైతం బాక్సాపీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అంతే కాకుండా తను ఆశించినన దానికంటే సెకండ్ ఇన్నింగ్ లో మరింత రెస్పాన్స్ రావడంతో, శ్రీదేవి ఫుల్ జోష్ లో ఉంది. అయితే తాజాగా శ్రీదేవి తీసుకున్న నిర్ణయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. ఇదంతా తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో జరిగింది. 
                                       అందాల కథానాయిక శ్రీదేవి ఇప్పుడు బబ్లీ హీరోయిన్ హన్సికకు తల్లిగా నటిస్తోంది. విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ సినిమాలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. అయితే ఈ మూవీలో శ్రీదేవి నటించేందుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రాకుమార్తెగా హన్సిక నటిస్తుండగా, మహారాణి పాత్రలో శ్రీదేవి నటిస్తుంది. కాగా, ఈ సినిమా కోసం చెన్నయ్ బీచ్ రోడ్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో రాజసౌధం సెట్టును భారీ వ్యయంతో నిర్మించారు. 
                                         ఈ సెట్లో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో విజయ్ సరసన మరో కథానాయికగా శృతి హాసన్ సైతం నటిస్తోంది. మహారాణి పాత్రలో శ్రీదేవి రూపం అత్యద్భుతం అని అంటున్నారు. ఈ మూవీలో శ్రీదేవి నటించేందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొదటగా ఈ పాత్రలో శ్రీదేవి నటించేందుకు అంగీకరించలేదు. తరువాత కథ విన్న తరువాత, కథలోని తన పాత్ర ప్రాముఖ్యతను డైరెక్టర్ వివరించాక, అప్పుడు అంగీకరించిందట.

No comments:

Post a Comment

Designed By Blogger Templates