Business

TollyWood

Breaking News

Technology

BollyWood

జూనియర్ కు విలన్ గా మారిన క్రికెటర్ !



పూరిజగన్నాథ్, జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో జూనియర్ కు విలన్ గా ఒక ప్రముఖ క్రికెటర్ నటించబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలం క్రితం మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భాగ్యనగరం వచ్చి దర్శకుడు పూరీని కలిసి ఏకాంతంగా చర్చించడమే కాకుండా అవకాశాలు కలిసి వస్తే తాను సినిమాలలో నటిస్తాను అని బహిరంగంగానే మీడియాకు లీక్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు శ్రీశాంత్.  ఈ విషయం అక్కడితో ముగిసి పోయింది అని అనుకున్నారు అంతా. 
                                      అయితే తిరిగి శ్రీశాంత్ ప్రస్తావన గత కొద్ది రోజులుగా ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. దీనికి కారణం పూరి దర్శకత్వం వహిస్తున్న జూనియర్ సినిమాలో ఒక డిఫరెంట్ విలన్ పాత్రను పూరి శ్రీశాంత్ కోసం డిజైన్ చేసాడు అని టాక్.  ఈ ఆలోచన జూనియర్ కు కూడా నచ్చడంతో శ్రీశాంత్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం పై త్వరలోనే అధికారక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. 
                                    ఒక వైపు బండ్ల గణేష్ ఆర్ధిక సమస్యల వల్ల ఈ మధ్యనే జరిగిన గోవా షెడ్యూల్ ఖర్చులు అన్నీ జూనియర్, పూరీలు భరించారు అని గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఈ కొత్త విలన్ పాత్రలో శ్రీశాంత్ వార్తల హడావిడి ఏమిటని టాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు ఆశ్చర్యపోతున్నట్లు టాక్...

No comments:

Post a Comment

Designed By Blogger Templates