బాలీవుడ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎఫైర్ అనేది చాలా కామన్ పాయింట్. అయితే సాధ్యమైనంత
వరకూ తెలియకుండా అటువంటి వ్యవహారాలను నడుపుతుంటారు. కాని కొందరు మాత్రం
అందరికి తెలిసేలా చేస్తుంటారు. దీంతో వీరు మీడియాలో బాగా పాపులర్ కావడం
జరుగుతుంది. అయితే ఈ తరహా సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువుగా
కనిపిస్తున్నారు. వారు ఏం చేసిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చెప్పి
మరీ చేస్తున్నరు. తాజాగా ఓ హాలీవుడ్ హీరోయిన్ తో డేట్ కి వెళ్లిన బాలీవుడ్
యాక్టర్, మళ్ళీ ఆమెతో మరోసారి డేట్ కి వెళ్ళి హాట్ టాపిక్ గా మారాడు. తనే
బిటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒక రాత్రంతా
హాలీవుడ్ బ్యూటీ పారిస్ హిల్టన్‌తో దుబాయ్‌లో గడపడం చర్చనీయాంశం అయిన
సంగతి తెలిసిందే.
త్వరలో ఆమె హృతిక్ సరసన ఏదైనా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉందనే
వార్తలు కూడ వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య ఆరోజు డేట్ జరిగిందని
బిటౌన్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. నిజానికి దుబాయ్ వీరిద్దరూ
కలసి ఉంది ఒక్క రోజే అని తెలుసు. కాని తాజాగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ
నుండి తెలుస్తున్న సమాచారం మేరకు హృతిక్ రోషన్, ఈ హాలీవుడ్ బేబ్ తో ఒక్క
రోజు గ్యాప్ తో మళ్ళీ ఎంజాయ్ చేశాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.
అయితే హృతిక్ రోషన్ గురించి పారిస్ హిల్టన్ మాట్లాడుతూ అతనితో కలిసి
బాలీవుడ్ సినిమాలో నటించాలని ఉందనే తన మనసులోని మాటను బయట పెట్టింది.
దీన్ని బట్టి త్వరలో హృతిక్ రోషన్ సినిమాలో పారిస్ హిల్టన్ నటించే అవకాశం
ఉందనే వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. గతంలో హాలీవుడ్ భామలను తన
సినిమాల్లో నటింపజేసిన హృతిక్ రోషన్...పారిస్ హిల్టన్‌తో రొమాన్స్ చేయడం
పెద్ద విషయమేమీ కాదు.
No comments:
Post a Comment