పవన్
కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిన
శ్రుతిహాసన్ పవన్ ఆలోచనలను, ఆశయాలను అనుసరించడంలో కూడా పవన్ అడుగులలో ఫాలో
అవుతోంది అనే విషయానికి సంబంధించి ఒక ఆశక్తికర సంఘటన జరిగింది.
మృత్యువుతో పోరాడుతూ కూడా తనను చూడాలని కలవరిస్తున్న చిన్నారి శ్రీజును
పవన్ కలిసి రావడమే కాకుండా ఆ చిన్నారికి బొమ్మలు ఇచ్చి ఆపాప వైద్య ఖర్చుల
నిమిత్తం ఆర్ధిక సహాయం కూడా చేసాడు పవన్.
ఈ వార్తలు తెలుసుకుని పవన్ హీరోయిన్ శ్రుతి కూడా పవన్ ను అనుసరిస్తూ
ఇంచుమించు ఇదే పని చేసింది. పూణే నగరానికి చెందిన షీతల్ అనే పాపకు
ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి రావడంతో గత ఆరు నెలలుగా ఆ పాప హాస్పటల్ లో
వైద్యం చేయించుకుంటోంది. అయితే ఈ చిన్నారికి శ్రుతిహాసన్ ను చూడాలనే కోరిక
కలిగి శ్రుతి గురించి కలవరిస్తోందట.
ఈ వార్తను తెలుసుకున్న శ్రుతి ఆ చిన్నారిని కలవడం కోసం ప్రత్యేకంగా పూణే
వెళ్ళి ఆ పాపను చూసి ధైర్యం చెప్పడమే కాకుండా ఆ చిన్నారికి బొమ్మలు కూడా
కొని ఇచ్చిందట. అయితే పవన్ లా మాత్రం ఆ పాపకు వైద్యం నిమిత్తం ఆర్ధిక
సహాయం చేసినట్లు వార్తలు రాలేదు.
దీనితో పవన్ ఆశయాలలో సగం మాత్రమే శ్రుతి నెరవేర్చగలిగింది అంటూ సెటైర్లు పడుతున్నాయి..
No comments:
Post a Comment