విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో గల సింగ్‌నగర్ పాయకాపురంలో
దారుణం చోటు చేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా కన్న కూతురిపైనే తండ్రి
అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి ఈ ఘటనకు
పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం
చేసి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. నిందితుడిని అదుపులోకి
తీసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం విజయవాడ
ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కృష్ణా జిల్లా
నిడమనూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య
చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలంలో
సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శ్రీవిద్య స్వస్థలం
కడప జిల్లా. ఆమె తండ్రి నౌకాదళం మాజీ ఉద్యోగిగా తెలుస్తోంది.
No comments:
Post a Comment