న్యూఢిల్లీ: పోలీసులపై ఆధారపడకుండా, తన కూతురుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నాడు ఓ తండ్రి(36). 14ఏళ్ల కూతురుకు తండ్రి అయిన అతడు తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకుని తన కూతురుపై అత్యాచారానికి పాల్పడిని నిందితుడ్ని హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో శుక్రవారం(అక్టోబర్ 31న) చోటు చేసుకుంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఆ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడ్ని ఎలా హింసించి చంపాడో వివరించాడు.
అతడు తన కూతురుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి(45)ని తన ఇంటికి ఆహ్వానించాడు. రాత్రి భోజనానికి తన ఇంటికి రావాలని అతడు నిందితుడ్ని కోరాడు. ఇంటికి వచ్చిన నిందితుడ్ని ఓ కూర్చీలో తాళ్లతో కట్టి బంధించాడు. ఆ తర్వాత బాగా వేడిచేసిన పట్టుకారుతో అతని జననాంగాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత గొంతునులిమి హత్య చేశాడు. నిందితుడ్ని హత్య చేయాలని తన కూతురుపై అత్యాచారం జరిగిన రోజు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లు చెప్పాడు.
అత్యాచారానికి గురైన తన కూతురు గురించి ఆలోచించి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన వివరించాడు. అత్యాచార ఘటనపై ఇరుగుపొరుగువారి నుంచి, బంధువుల నుంచి తన కూతురుకు ఎదురయ్యే పరిణామాలకు భయపడి తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. ఆ తండ్రి ఇచ్చిన వివరాల మేరకు అతని ఇంటికి చేరుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
No comments:
Post a Comment