ఇండియన్
సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేశారు. ఈ
ఏడాది మే నెలలో రజినీకాంత్ ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. కొన్ని గంటల్లో
రజినిని ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షలు దాటింది. రజిని చేసిన ఫస్ట్ ట్వీట్ ను
ఇప్పటివరకు 15 వేల మంది రీ ట్వీట్ చేయగా, 20 వేల మంది తమ ఫేవరెట్ ట్వీట్
గా పేర్కొన్నారు. ఇదొక రికార్డు. తాజాగా ట్విట్టర్ లో ఈ సూపర్ స్టార్ ను
ఫాలో అయ్యేవారి సంఖ్య 1 మిలియన్ దాటింది. 63 ఏళ్ళ వయసులో యువ హీరోలకు
ధీటుగా సోషల్ మీడియాలో కూడా వారికి సవాల్ విసురుతున్నారు. ఇప్పటివరకు
రజినీకాంత్ కేవలం 7 సార్లు మాత్రమే ట్వీట్ చేయడం విశేషం.
ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న ‘లింగ’ సినిమా చిత్రీకరణ చివరి దశకు
చేరుకుంది. ఈ ఏడాది రజిని బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి
చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. రజిని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ
సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. కెఎస్ రవికుమార్
దర్శకత్వం వహించారు.
No comments:
Post a Comment