Business

TollyWood

Breaking News

Technology

BollyWood

జూనియర్ ని టెన్షన్ పెడుతున్న పూరీ ?



టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో స్టార్ డం ని సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు, తనని టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకొని వెళ్లాయి. కాని ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో, ఈ మూవీకి సంబంధించిన రిజల్ట్ పై ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టి.. మహేష్ ను కొత్త లుక్ తో చూపించాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు అలాంటి భారీ హిట్ నే ఎన్టీఆర్ కు ఇవ్వాలని భావిస్తున్నాడట. 
                                  ఎన్టీఆర్ పూరీ కాంబినేషన్ లో రాబోతున్న తాజా చిత్రంలో పూరి.. ఎన్టీఆర్ ను ఓ సరికొత్త స్టైల్లో చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అన్నీ కొత్త తరహాలో ఉంటాయని సమాచారం. కాగా ఎన్టీఆర్, పూరీల కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాలా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో పూరీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే 'ఆంధ్రావాలా' చిరు కోసం రాసుకున్న కథ అనీ.. అది ఎన్టీఆర్ తో చేయడంతోనే సెట్ కాలేదని పూరి చెబుతున్నాడు. 
                                     అయితే ఓ అట్లర్ ప్లాప్ కాంబినేషన్ తో ముందుకు వెళుతున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ ఇండస్ట్రీలో ఏ తరహా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో పెద్దగా ఊహించనవసరం లేదు. అంతే కాకుండా బిజినెస్ వర్గాల్లోనూ ఈ కాంబినేషన్ పై పెట్టుబడి పెట్టటానికి కొద్దిగా ఆలోచిస్తున్నారంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ హిట్ కాకుంటే, మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కలవడం అసాధ్యమనే అంటున్నారు.

No comments:

Post a Comment

Designed By Blogger Templates