అనుష్క
హీరోయిన్ కాదు అంటూ రానా చేసిన కామెంట్లు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి.
అనుష్క తో రెండు భారీ సినిమాలు చేసిన తరువాత తనకు అనుష్క పై ఉన్న అభిప్రాయం
తారుమారు అయిందని అంటూ ప్రస్తుతం ఆమెను హీరోయిన్ గా కాకుండా టాలీవుడ్ టాప్
హీరోలలో ఒకరుగా ఆమెను పరిగణిస్తున్నానని కామెంట్ చేసాడు రానా. అనుష్క తో
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాలకు పని చేసిన తరువాత రానా ఆలోచనలలో ఈ
మార్పు వచ్చిందట.
అంతేకాదు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాలకు ఆమె హీరో అని అంటున్నాడు
రానా. తనతో పాటు ప్రభాస్ తో కూడా సమానంగా డాన్సులు, ఫైట్లు అనుష్క చేసింది
అని అంటూ అందంతో పాటు ఇలాంటి స్కిల్స్ కూడా ఉండటం సామాన్య విషయం కాదు అని
అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించాడు రానా. టాలీవుడ్ లోనే కాదు దక్షిణ
భారత సినిమా రంగంలో అనుష్క రేంజ్ ఎవరు చేరుకోలేరు అని రానా చెపుతున్న మాటలు
నిజమే అయినా ‘బాహుబలి’ కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్ కు రానా చేసిన
కామెంట్లు నచ్చుతాయా అన్నదే ప్రశ్న.
ఈ కామెంట్లు ఇలా ఉండగా రేపు అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల
కాబోతున్న ‘రుద్రమదేవి’ టీజర్ అనుష్క రేంజ్ ని ఇంకా ఎంత ఎత్తుకు తీసుకు
వెళ్ళుతుందో చూడాలి..
No comments:
Post a Comment