టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్, బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను టాప్ హీరోలకి కథ చెప్పితే, ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపించకపోవడంతో, తను బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్ తో జోడి కట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే బోయపాటితో ఒకరిద్దరి హీరోలు ఆసక్తి చూపించినప్పటికీ, ప్రస్తుతం ఆ హీరోలు చాలా బిజి షెడ్యూల్ లో ఉండటంతో, బోయపాటి కూడ ఈ గ్యాప్ లో ఓ యంగ్ హీరోతో మూవీకి సిద్ధపడ్డాడు.
ఇదిలా ఉంటే బోయపాటికి అవకాశం ఇచ్చిన బడా నిర్మాత బెల్లంకొండ సురేష్, తన తనయుడి మూవీకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉండాలో ప్రత్యేకమైన క్లాస్ తీసుకొని మరీ బోయపాటికి చెప్పాడట. అంతే కాకుండా మూవీకి సంబంధించి ఎటువంటి నెగిటివ్ టాక్ వచ్చినా, ఎప్పటికప్పడూ దర్శకుడి వంతుగా వాటిని నివారిస్తూ రావాలని చెప్పాడట. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించే రెండో చిత్రం షూటింగ్ ఆమధ్య ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదలెట్టిన ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ నష్టనివారణ చర్యలను చేపట్టాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుందని మీడియాకు ప్రకటన రిలీజ్ చేశాడు.
ఈ సందర్భంగా బోయపాటి చెబుతూ, "వినాయక్ గారి అల్లుడు శీను సినిమా ద్వారా శ్రీనివాస్ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చేయబోయే సినిమాకి అతనిలోని మరో వేరియేషన్ ని చూపించబోతున్నాను. అందుకోసం తానిప్పుడు రెడీ అవుతున్నాడు. ఆ ప్రిపరేషన్ పూర్తవగానే షూటింగ్ మొదలెడతాం" అన్నారు. బోయపాటి గారు చెప్పిన కథ చాలా ఇన్స్ పైరింగ్ గా ఉందనీ, ఈ సినిమా తనకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనీ చెప్పాడు హీరో శ్రీనివాస్. మొత్తంగా ప్రెస్ మీట్స్ కి తక్కువుగా హజరయ్యే బోయపాటికి, బెల్లంకొండ భలే ఝలక్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment