గత
రెండు రోజులుగా వేబ్ మీడియాలో అనుష్క� చేతికి గాయం అయినట్లు వార్తలు
వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు. అనుష్కకు తగిలిన
గాయం రుద్రమదేవి షూటింగ్ లో జరిగినట్లు వెల్లడించారు. రుద్రమదేవి సినిమాకి
సంబంధించి యాక్షన్ సన్నివేశాలను షూటింగ్ 40 రోజులు జరగాల్సి ఉండగా 30వ రోజు
అనుష్క కుడిచేతి మణికట్టు ఫ్యాక్చర్ అయ్యిందని , డాక్టర్లు ఆమెని కొన్ని
రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట.
దాంతో
ఆ యాక్షన్ సన్నివేశాలతో ఆమెని ఇబ్బంది పెట్టకూడదు అని డూప్ పెట్టమన్నాడట
గుణశేఖర్. కానీ ఈ విషయానికి ఒప్పుకోకుండా అనుష్క తానె స్వయంగా యాక్షన్
సన్నివేశాల్లో పాల్గొంటానని మిగిలిన పదిరోజుల షూటింగ్ కూడా పూర్తి
చేసినట్లు గుణశేఖర్ తెలిపాడు. ఆ గాయాన్ని లెక్క చేయకుండా మందులు వాడుతూ
షూటింగ్ పూర్తి చేయడంతో చిత్ర యూనిట్ అనుష్కకు వృత్తిపై ఉన్న డెడికేషన్ కు
ఫిదా అయ్యారట.
అంతేకాక
తన చేతికి ఉన్న గాయం కనిపించకుండా గాయమయిన చోట స్కిన్ కలర్ ఉండే
బ్యాండేజీని ఐదు చుట్లు చుట్టుకొని షూటింగ్ పూర్తి చేసిందట. ఇంత పట్టుదల
ఉన్న హీరోయిన్ కాబట్టే సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
No comments:
Post a Comment