టాలీవుడ్లో
అతి వేగంగా సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు మంచి పేరున్నది.
అయన ఏ స్టార్ హీరోతో అయిన కేవలం రోజుల వ్యవధిలోనే సినిమాల్ని పూర్తి
చేస్తాడు. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల
ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం
తెలిసిందే. ఈ షూటింగ్ కార్యక్రమాలు జరుపుతూనే , ఎప్పటికప్పుడు ఆ
సన్నివేశాలను కూడా ఎడిట్ చేస్తున్నారు. ఎ సినిమాకు కూడా చిత్రీకరణ
పూర్తయ్యాకే ఎడిటింగ్ చేస్తారు.
కానీ పూరి స్పీడు కదా. అందుకే షూటింగ్ సమయంలోనే ఎడిటింగ్ పనికూడా
చేసేస్తున్నారు. దాంతో సమయం వృధా అవకుండా , షూటింగ్ కి ఎక్కువ సమయం
తీసుకోదు. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎడిటింగ్ కూడా పూర్తవుతుంది. కాబట్టి
వెంటనే డబ్బింగ్ పనులు మొదలు పెట్టొచ్చు. ఇలా పూరి ఎన్టీఆర్ సినిమాని
వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం
అందిస్తున్నారు.
No comments:
Post a Comment