నాగార్జున
చొరవతో ‘స్వఛ్ భారత్’ కార్యక్రమం వైపు టాలీవుడ్ సెలెబ్రెటీల దృష్టి పడటమే
కాకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి టాలీవుడ్ హీరోలంతా ఒకొక్కరుగా
ముందుకు వస్తున్నారు. నాగ్ ‘స్వఛ్ భారత్’ కార్యక్రమంలో పాల్గొని ఆ
కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అల్లుఅర్జున్ కు పిలుపు ఇచ్చిన విషయం
తెలిసిందే. నాగార్జున పిలుపుకు స్పందించిన బన్నీ తన ఫేస్ బుక్ లో ఈ
విషయమై నాగ్ కు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా త్వరలో తాను తన అభిమానులతో
కలిసి ‘స్వఛ్ భారత్’ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలియచేసాడు.
అయితే ఇప్పుడు బన్నీ చేస్తున్న పని పవన్ కు తలనొప్పిగా మారింది అని
అంటున్నారు. దీనికి కారణం ఈమధ్యనే ప్రముఖ షటిల్ ప్లేయర్ పివి సింధు
‘స్వఛ్ భారత్’ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా
పవన్ ను కోరింది. దీనిపై పవన్ ఇంత వరకు స్పందించలేదు.
బన్నీ నాగ్ పిలుపుకు స్పందించి ‘స్వఛ్ భారత్’ కార్యక్రమాన్ని చేపడుతూ
ఉండటంతో సింధూ ఇచ్చిన పిలుపుకు పవన్ స్పందించవలసిన అవసరం ఏర్పడింది అని
అంటున్నారు. మోడీ కోసం ఓట్లు వేయమని ఇరు రాష్ట్రాలలోను ప్రచారం చేసిన
పవన్, మోడీ ప్రచారం చేస్తున్న కార్యక్రమం నుండి తప్పించుకోలేని విధంగా
బన్నీ ఇచ్చిన స్పందన పవన్ కు మరొక సమస్యగా మారింది అంటూ సెటైర్లు
పడుతున్నాయి..
No comments:
Post a Comment