Business

TollyWood

Breaking News

Technology

BollyWood

రజనీకాంత్ ‘లింగా’ టీజర్ అదిరింది (వీడియో) !



హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్ లు గా నటిస్తున్న లింగా చిత్రం టీజర్ విడుదల చేశారు. రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకం పై రాక్ లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా నిర్మిస్తున్న లింగా చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రజనీ కాంత్ జన్మదిన కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది. 



 భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహామాన్ ఈ సినిమా‌కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఆడియోని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల చేస్తున్నారు. నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేష్ మాట్లాడుతూ "మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజని కాంత్ గారితో చేయటం చాలా హ్యాపీ గా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశం లో ఉన్నతమైన సంకేతిన నిపుణుల తో ఈ చిత్రం చేస్తున్నాము. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారితో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. 




 రవికుమార్- రజని కాంత్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, న‌ర‌సింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ చిత్రాలని మించి ఉంటుంది అన్నారు. ఇటీవ‌లే రామోజీ ఫిల్మ్ సిటి‌లో ర‌జ‌నీ కాంత్‌, సోనాక్షి సిన్హా ల పై 8 రోజుల పాటు, 200 మంది డాన్స‌ర్స్ పై మూడున్న‌ర కోట్ల‌తో చిత్రీకరణ జరిగింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ గారు దుబాయ్, మోకా మరియు అబుదాబి సాంగ్స్ షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. ఎబ్రాడ్‌లోనే కొన్ని సాంగ్ సీక్వెన్స్ మ‌రియు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చిత్రీక‌రిస్తారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న మా చిత్రానికి ఏ.ఆర్‌.రెహ‌మ‌న్ అందించిన ఆడియో‌ని నవంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల చేస్తున్నాము. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజున చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము " అన్నారు .

No comments:

Post a Comment

Designed By Blogger Templates