హీరోల
పై సెటైర్లు వేస్తూ తన ట్విటర్ లో హంగామా చేసే క్యూట్ బ్యూటీ సమంత ఒక టాప్
హీరోతో నటించే అవకాశం వస్తే తాను లిప్ లాక్ సీన్ లో నటించడానికి రెడీ అంటూ
మీడియా ముందు అన్న మాటలు ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారాయి.
హీరో విజయ్ ‘కత్తి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్
కావడంతో సమంత ఫుల్ జోష్‌లో వుంది. తాను పుట్టి పెరిగిన తమిళనాడులో
కోలీవుడ్ ప్రేక్షకులకు తన స్థాయి చూపెట్టే హిట్ కోసం ఎదురు చూస్తున్న కల
ఇన్నిరోజులకు ‘కత్తి’ ద్వారా తీరడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకపోవడంతో
రెండు రోజులు క్రితం చెన్నైలో జరిగిన ‘కత్తి’ సక్సస్ ఫంక్షన్ లో వేలాది జనం
మధ్య తన మనసులోని మాట బయటపెట్టేసింది.
హీరోయిన్‌గా విజయ్ తనకు మళ్ళీ మరొక సినిమాలో
మళ్లీ అవకాశం ఇస్తే విజయ్ తో లిప్‌లాక్ సీన్‌లో నటించేందుకు సిద్ధమేనంటూ
సమంత చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఇప్పుడు ఈ మాయలేడి
ఇచ్చిన స్టేట్‌మెంట్ పై కోలీవుడ్ రకరకాలుగా ప్రచారం సాగుతోంది.
ఏదో సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడుతుంది అని
అనుకుంటే ఇలా బుకింగ్స్ లేని హీరోయిన్ లా ఇలా తన స్థాయిని దిగజార్చుకుని
మాటలు మాట్లాడటం ఏమిటి అంటూ కోలీవుడ్ మీడియా ఆమె పై వరస పెట్టి విమర్శలు
గుప్పిస్తోంది. సమంత కెరియర్ లో ఏనాడు ఊహించని 100 కోట్ల కలెక్షన్స్
కురిపిoచబోతున్న సినిమాలో నటించిన ఆనందంతో సమంత ఇలా అదుపు తప్పి
మాట్లాడింది అనుకోవాలి...
No comments:
Post a Comment