Business

TollyWood

Breaking News

Technology

BollyWood

జూనియర్ ఎన్టిఆర్ చేయని పని కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు !




చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి మెగా అభిమానులకు జోష్ కలిగించడానికి చరణ్ ఇప్పటికే తన వంతు ప్రయత్నం చేసాడు. అదే బాటను ఫాలో అవుతూ అక్కినేని హీరోలు అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలలోని పాటలను రీమిక్స్ చేసి అక్కినేని జ్ఞాపకాలు కలకాలం ఉండేలా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటను నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అనుసరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
                          వినపడుతున్న వార్తల ప్రకారం కళ్యాణ్ రామ్ తాను నిర్మిస్తూ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘పటాస్’ లో తాను ఎంతగానో అభిమానించే తన బాబాయ్ బాలకృష్ణ నటించిన పాటను రీమిక్స్ చేసి ఆ పాటలో నటించబోతున్నాడని టాక్.
                            బాలకృష్ణ కెరియర్ లో సూపర్ హిట్ గా చెప్పుకోతగ్గ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సినిమాలోని ఒక పాటను తాను నటిస్తున్న ‘పటాస్’ సినిమా కోసం రీమిక్స్ చేయడమే కాకుండా ఒరిజినల్ సినిమా పాటలోని బాలకృష్ణ నటించిన విజువల్స్ ను కూడా చూపెడతాడట కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఎటువంటి హిట్స్ లేకుండా సతమతమౌతున్న కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకోసం వేస్తున్న ఈ ఎత్తుగడ ఎంత వరకు విజయవంతం అవుతుందో చెప్పలేని విషయం. 
                           అయితే ఇదే రీమిక్స్ ను జూనియర్ తాను నటిస్తున్న కొత్త సినిమాలో చేస్తే మటుకు ఆ ఎత్తుగడ విజయవంతం అవడమే కాకుండా నందమూరి కుటంబసభ్యులతో సయోధ్య పెంచుకోవాలి అని ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ ప్రయత్నాలకు బాగా ఉపయోగపడేది. ఏమైనా జూనియర్ కు రాని ఆలోచన కళ్యాణ్ రామ్ కు వచ్చింది..

No comments:

Post a Comment

Designed By Blogger Templates