Business

TollyWood

Breaking News

Technology

BollyWood

త్రివిక్రమ్ పై కామెంట్స్ చేసిన సిరివెన్నెల !



తెలుగు సినిమాలు చూసే వారికి త్రివిక్రమ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా వివరించవలసిన పనిలేదు. మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ సినిమా డైలాగ్స్ విషయంలో చేసిన ప్రయోగాలు ఒక నూతన అధ్యాయాన్ని సృస్టించాయి. అటువంటి ట్రెండ్ సెటర్ పై ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన కామెంట్స్ అత్యంత ఆశక్తి దాయకంగా మారాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ “అందరికీ అయినవాడే అయినప్పటికీ అందడు ఎవ్వరికీ” అంటూ త్రివిక్రమ్ వ్యక్తిత్వం పై సిరివెన్నెల కామెంట్లు విసిరాడు. 
                                        త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు అంత సులువుగా ఒక పాట రాసి ఆయనను మెప్పించ లేమని ఆ సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన భావం, సాహిత్యం, ఇలా ఏ విషయంలో తేడా కనిపించినా త్రివిక్రమ్ అంగీకరించడు అని అంటూ, ఆయన సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు తమ మధ్య తీవ్రమైన చర్చలు వాదనలు కూడా తలేత్తేవని అంటూ త్రివిక్రమ్ నటులనే కాదు రచయితలను కూడా ఎలా పిండేస్తాడో వివరించాడు సిరివెన్నెల.  
                                ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలలో తాను పాటలు రాయలేకపోవడానికి గల కారణం ఆ కథకు సంబంధించి తాను రాయదగ్గ పాటలు లేవని త్రివిక్రమ్ బావించడం వల్ల తాను ఆ సినిమాలలో పాటలు రాయలేకపోయానని అంటూ తాను రాయగల పాటలు ఉంటే తప్పకుండా త్రివిక్రమ్ సినిమాలలోని పాటల కోసం తప్పకుండా తన దగ్గరకు వస్తాడు అని సెటైరు వేసాడు సిరివెన్నెల.  ఈ మాటలను బట్టి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలలోని నటీనటుల ఎంపిక విషయంలోనే కాదు సిరివెన్నెల లాంటి మహారచయితల విషయంలో కూడా త్రివిక్రమ్ శైలి ఎంతభిన్నంగా ఉంటుందో అర్ధం అవుతుంది..

No comments:

Post a Comment

Designed By Blogger Templates